Eto Vellipoyindhi Manasu : భార్యకి సర్ ప్రైజ్ ఇచ్చిన భర్త.. మోస్ట్ హ్యాపీ!
on Oct 1, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -214 లో.....రామలక్ష్మి ఆలోచిస్తుంటే మాణిక్యం వచ్చి.. దేని గురించి ఆలోచిస్తున్నావని అంటాడు. ఆయనపై ఎటాక్ చేసింది ఇంట్లో వాళ్లే అని డౌట్ గాఉంది కానీ సాక్ష్యం లేకుండా ఎలా నిరూపిస్తామని రామలక్ష్మి అంటుంది. ఎటక్ చేసింది ఎవరో నేనే కనుక్కుంటా.. నాకు నీ హెల్ప్ కావాలని మాణిక్యాన్ని రామలక్ష్మి అడుగుతుంది. ఏదైనా చేస్తానని మాణిక్యం అంటాడు. ఎటాక్ చేసినా వాడిని చూసావా అని రామలక్ష్మి అడుగుతుంది. లేదు సిరి చూసి ఉంటుంది. తనని అడుగు అని మాణిక్యం సలహా ఇస్తాడు.
ఆ తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పాకని రామలక్ష్మి అంటుంది. మాణిక్యం సరే అని అంటాడు. మాణిక్యం వెళ్తు సీతాకాంత్ తో వెళ్తున్నా అని చెప్తాడు. మీ కూతురుకు ఏది అంటే బాగా ఇష్టమని అడుగుతాడు. నా కూతురికి చందమామని చూస్తూ ఉయ్యాలా ఊగుతూ ఆవకాయ అన్నం తిన్నడం అంటే చాలా ఇష్టమని సీతాకాంత్ తో మాణిక్యం చెప్పి వెళ్లిపోతాడు.ఆ తర్వాత సిరి దగ్గరికి రామలక్ష్మి వచ్చి.. సీతా సర్ పై ఎటాక్ చేసిన వాడిని చూసావా అని అడుగుతుంది. నాకేం గుర్తు లేదని అంటుంది. ఆ తర్వాత గుర్తు వచ్చిందంటూ అతని చెయ్ పై స్నేక్ టాటూ ఉంటుందని చెప్తుంది. సరే ఈ విషయం ఎవరికి చెప్పకని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రాత్రి రామలక్ష్మి కళ్ళకి గంతలు కట్టి సస్పెన్స్ అంటూ ఇంటి ముందుకి తీసుకొని వెళ్తాడు సీతాకాంత్. ఉయ్యాలాలో కూర్చొపెట్టి గంతలు విప్పి ఉయ్యాల ఊపుతాడు . ళ్ళు తెరవమని అంటాడు. రామలక్ష్మి కళ్ళు తెరిచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ఆవకాయతో భోజనం తినిపిస్తాడు సీతాకాంత్. దాంతో రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
అదంతా చూస్తున్న శ్రీవల్లి.. వెళ్లి శ్రీలతకి చెప్పి తనని తీసుకొని వస్తుంద. వాళ్ళు అలా హ్యాపీగా ఉండడం చూసి వాళ్ళని ఎలాగైనా విడగొట్టాలని శ్రీలత అనుకుంటుంది. మరుసటి రోజు నందిని ఇంట్లో పని చేసే అయోమయం బయటకు వస్తాడు. అతన్ని మాటల్లో పెట్టి ఆతని ప్లేస్ లో సీతాకాంత్ అప్పాయింట్ చేసుకున్న డిటేక్టివ్ నందిని ఇంటికి వెళ్తాడు. అయోమయం ఎక్కడ అని నందిని, హారిక అడుగుతారు. తను నా బ్రదర్ అర్జెంట్ వర్క్ ఉంటే వెళ్ళాడు. నన్ను ఇంట్లో వర్క్ చెయ్యమని చెప్పాడని వాళ్లకి డౌట్ రాకుండా డిటేక్టివ్ అంటాడు. మరొకవైపు రామలక్ష్మి ఆఫీస్ కి వెళ్తుంటే సీతాకాంత్ అన్ని రెడీగా పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read